ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > రొటేషన్ కెప్టెన్సీ విధానం మంచిదే: పాంటింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రొటేషన్ కెప్టెన్సీ విధానం మంచిదే: పాంటింగ్
FILE
ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీంకు కోచ్ బుచానన్ ప్రకటించిన రొటేషన్ కెప్టెన్సీ విధానం బాగానే ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ రెండో సీజన్‌లో నలుగురైదుగురు కెప్టెన్లు ఉంటారని ఆ జట్టు మేనేజర్ జాన్ బుచానన్ చేసిన ప్రకటనపై భారత్‌లో భిన్నాస్వరాలు వినిపిస్తున్నప్పటికీ, బుచానన్ కెప్టెన్సీ విధానంతో మంచేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఆలోచన కూడా కొంత మెరుగ్గానే ఉందని పాంటింగ్ అన్నాడు. దీని వలన రెగ్యులర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై కొంత ఒత్తిడి తగ్గుతుందని తెలిపాడు. ఈ ఆలోచన కూడా విజయవంతమయ్యే అవకాశం ఉందన్నాడు. అయితే ఈ ఆలోచన మైదానంలో ఎలా పనిచేస్తుందో ఊహించలేనన్నాడు.

ఇటువంటి ఆలోచనను టాస్మానియా జట్టు కొన్నేళ్ల క్రితం అమలు చేసిందని, ఆ జట్టుకు డాన్ మార్ష్, జార్జి బైలే కెప్టెన్లుగా ఉన్నారని రికీ ఈ సందర్భంగా ఎత్తి చూపారు. ఈ పద్ధతి ద్వారా మైదానంలో ఒకరు ఫీల్డింగ్ మార్పులు చూసుకుంటుండగా, మరొకరు బౌలింగ్ అవకాశాలను పర్యవేక్షించారని రికీ తెలిపాడు. దీనివలన సాధారణ పద్దతి కంటే కెప్టెన్‌పై ఒత్తిడి తగ్గుతుందని పాంటింగ్ తెలిపాడు.

ఇదిలా ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరపున రికీ పాంటింగ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. రికీ పై వ్యాఖ్యలు చేశాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంట్రాక్టుల రద్దు: ఐపీఎల్‌పై పాక్ క్రికెటర్ల దావా!
రెండో సీజన్లో విమర్శలను తిప్పి కొడతాం: మాల్యా
ఐపీఎల్‌లో మెరుగ్గా ఆడుతా: గంగూలీ హామీ
రొటేషన్ కెప్టెన్సీ అంటేనే.. నవ్వొస్తుంది: వెంగీ
రెండో సీజన్‌లో చూపిస్తా..! నా తఢాకా ఏమిటో..?
కెప్టెన్సీ వివాదంపై షారూఖ్, దాదా చర్చలు!