ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > రెండు వికెట్ల తేడాతో రాయల్స్ విజయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రెండు వికెట్ల తేడాతో రాయల్స్ విజయం
డర్భన్‌లో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ ట్వంటీ-20లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు మరోసారి విజయం సాధించింది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 129 పరుగులు సాధించి 19.4 ఓవర్లకే ఆలౌట్ అయింది. జట్టులో ఓపెనర్ హేడెన్ 60(38) ఒక్కడే ఆటలో రాణించగా మిగిలిన వారు రాయల్ ఛాలెంజర్స్ ముందు తలవంచక తప్పలేదు. దీంతో సూపర్ కింగ్స్ తక్కువ స్కోరుతోనే పెవిలియన్ దారి పట్టింది.

తదనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తడబడింది. ఊతప్ప(6), కలిస్(0), ద్రావిడ్(8) పరుగులకే పెవిలియన్ చేరారు.

ఇదిలావుండగా రాస్ టేలర్(46), కోహ్లీ(38) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో వచ్చిన ప్రవీణ్ కుమార్(12) పరుగులు సాధించి జట్టును గెలుపుబాట దిశగా నడిపించాడు. కాగా 46 పరుగులు సాధించిన టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
విజృంభించిన రాయల్స్ బౌలర్లు: చెన్నై 129
ఛాలెంజర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!
ముంబై ఇండియన్స్‌తో రాయల్స్ కీలక పోరు నేడే!
ఎస్ఎంఎస్ గేమ్‌పై సమీక్ష: ఐపీఎల్
కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి
పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం