దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి జట్టు తడబడటంతో విజయం రాజస్థాన్‌ను వరించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ క్యూనే (51), రవీంద్ర జడేజా (42)లు రాణించడంతో ఆ జట్టు మంచి స్కోరు సాధించగలిగింది.
అనంతరం 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబయి జట్టు ప్రారంభంలో బాగానే ఆడినా చివరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక ఆలౌట్ కావడంతో విజయాన్ని చేజార్చుకుంది. ముంబయి జట్టులో సచిన్ (40), నాయర్ (35)లు రాణించినా చివరి వరుస బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్ ముఖం పట్టడంతో రాజస్థాన్ జయకేతనం ఎగురవేసింది.
ఇకపోతే.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జయసూర్య రెండు వికెట్లు పడగొట్టగా, మలింగా, బ్రేవో, భజ్జీ, నందాలు చెరో వికెట్ సాధించారు. రాజస్థాన్ రాయల్స్ బాలర్లలో కెప్టెన్ షేన్ వార్న్ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా, పటేల్, త్రివేదిలు రెండేసి వికెట్లు సాధించారు.
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధీటుగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్‌వార్న్‌కు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు లభించింది. |