ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > ఢిల్లీతో పంజాబ్ కీలక పోరు నేడే!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఢిల్లీతో పంజాబ్ కీలక పోరు నేడే!
FILE
ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ శుక్రవారం ఢీ కొననుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే పంజాబ్‌కు సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో ఆరింటిలో ఓటమిపాలైన పంజాబ్‌ మిగిలిన మూడు పోటీల్లో గెలిస్తేనే సెమీస్‌ చేరుకునే అవకాశముంది.

మరోవైపు.. ఇప్పటికే 16 పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌కు చేరుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ మ్యాచ్‌లో ఓడినా నష్టం లేదు. అయితే పంజాబ్‌కు చేతిలో ఉన్న మూడు మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిందే.

ఇక సంగక్కర, యువరాజ్‌, జయవర్ధనే, కటిచ్‌ వంటి బ్యాట్స్‌మన్లతో పంజాబ్‌ బ్యాటింగ్‌ బలోపేతంగా ఉంది. కానీ ఢిల్లీపై పంజాబ్ గట్టిపోటీని ప్రదర్శిస్తుందో? లేదో చూడాల్సిందే.

అదేవిధంగా.. చావ్లా, బ్రెట్‌లీ, ఇర్ఫాన్‌లు ఉన్నప్పటికీ పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా ఆడితేనే పంజాబ్‌ విజయం దక్కుతుంది.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే గంభీర్‌, సెహ్వాగ్‌, దిల్షాన్‌, వార్నర్‌, డివిలియర్స్‌ ఇలా ప్రతి బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే సెమీస్‌ చేరడంతో ఢిల్లీపై ఎలాంటి ఒత్తిడి కూడా లేకపోవడంతో రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఢిల్లీ, పంజాబ్ జట్ల గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

పంజాబ్ జట్టు: సోహల్, సైమన్ కటిచ్, కుమార్ సంగక్కర, కరణ్ గోయెల్, యువరాజ్ సింగ్ (కెప్టెన్), మోతా, బ్రెట్‌లీ, పియూష్ చావ్లా, సింగ్, విక్రమ్‌జీత్ మాలిక్, యూసఫ్ అబ్దుల్లా.

ఢిల్లీ డేర్ డెవిల్స్: గౌతమ్ గంభీర్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), దిల్షాన్, విల్లియర్స్, దినేష్ కార్తీక్, భాటియా, అమిత్ మిశ్రా, ప్రదీప్ సంగ్వాన్, నెహ్రా, నేన్స్.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
ఐపీఎల్-2: ఇండియన్స్‌పై రాయల్స్ విజయం
మరోసారి మెరిసిన టేలర్: చెన్నైపై బెంగుళూరు గెలుపు
రెండు వికెట్ల తేడాతో రాయల్స్ విజయం
విజృంభించిన రాయల్స్ బౌలర్లు: చెన్నై 129
ఛాలెంజర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!
ముంబై ఇండియన్స్‌తో రాయల్స్ కీలక పోరు నేడే!