దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ సెమీస్ అవకాశాలను పంజాబ్ కింగ్స్ సజీవంగా నిలుపుకుంది. ఐపీఎల్ రెండో సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డేర్‌డెవిల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు చేసింది. కార్తీక్ (32), మన్హస్ (26) తప్ప, మిగిలిన బ్యాట్స్‌మెన్లు అంతగా రాణించలేకపోయారు.
ఢిల్లీ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులను సాధించి, గెలుపును నమోదు చేసుకుంది.
పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో సంగక్కర (43), పఠాన్ (21), కటిచ్ (20), యువరాజ్ సింగ్ (18)లు ధీటుగా రాణించడంతో కింగ్స్ సునాయాసంగా విజయ లక్ష్యాన్ని అధిగమించారు.
ఇకపోతే.. పంజాబ్ బౌలర్లలో బ్రెట్‌లీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా, పఠాన్, శ్రీశాంత్ రెండేసి వికెట్లు సాధించారు. మోతా ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మహరూఫ్ 2 వికెట్లు పడగొట్టగా, నెహ్రా, సంగ్వాన్ చెరో వికెట్ సాధించారు. ఢిల్లీపై విజృంభించి ఏకంగా మూడు వికెట్లు సాధించిన బ్రెట్‌లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. |