ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ బాగోలేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దాదాపుగా బౌలర్లు మాత్రం గెలిపించారని సెహ్వాగ్ చెప్పాడు.
ట్వంటీ-20 బ్యాడ్ క్రికెట్ అని, ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే వరుసగా పరాజయం ఎదురవుతుందని వీరూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందుచేత తమ జట్టుకు ఆ ప్రమాదం ఎదురవకుండా ధీటుగా రాణించేందుకు కృషి చేస్తామని డేర్‌డెవిల్స్ కెప్టెన్ తెలిపాడు.
యువరాజ్, సంగక్కర నిర్మించిన భాగస్వామ్యంతో, వికెట్లు తీస్తేనే గెలిచే పరిస్థితి నెలకొందని వీరూ చెప్పాడు. దీంతో పంజాబ్‌పై విజయం చేజారిపోయిందని అతడు పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా... శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఢిల్లీపై, పంజాబ్ విజయం నమోదు చేసుకున్న విజయంతో, పంజాబ్ 12 పాయింట్లు సాధించి ఐపీఎల్ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
అదేవిధంగా.. ఐపీఎల్‌లో తిరుగులేని జట్టుగా దూసుకుపోతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపీఎల్ పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. |