బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుని సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్న ముంబై, సూపర్ కింగ్స్‌పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశముందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేవిధంగా ముంబై ఇండియన్స్‌పై ఈ మ్యాచ్ గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ సెమీస్ ఆశలు మరింత మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో బద్రినాథ్, ధోనీ, మ్యాథ్యూ హేడెన్, రైనా వంటి ఆటగాళ్లతో చెన్నై జోరు మీదుంది. అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచిన వెటరన్ బ్యాట్స్‌మన్ హేడెన్ మరోసారి రాణిస్తే ముంబైకి కష్టాలు తప్పవని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేగాకుండా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రేక్ వేయడం ముంబైకి కష్టంతో కూడిన పనేనని వారు అంటున్నారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లోనైనా ధీటుగా రాణిస్తోందో? లేదో? వేచి చూడాల్సిందే..! |