ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, డెక్కన్ ఛార్జర్స్ బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా జాతీయ జట్టు బౌలింగ్ ట్రైనర్ విక్టర్ బార్నెస్ నియమితుడయ్యారు. చార్జర్స్ ఆడనున్న మిగిలిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లకు బార్నెస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.
ఇదిలా ఉంటే.. బౌలింగ్ కోచ్‌గా బార్నెస్ ఎంపిక కావడంపై గిల్‌క్రిస్ట్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టిన బార్నెస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నోబాల్స్‌తో ఇబ్బంది పడుతున్న ఆర్పీ సింగ్, షోయబ్ మక్సూసీలకు కొన్ని సూచనలిచ్చానని చెప్పారు.
బౌలింగ్ మెరుగుపర్చుకునే దిశగా ఛార్జర్స్ బౌలర్ల సందేహాలను నివృత్తి చేశానని బార్నెస్ తెలిపారు. బౌలింగ్‌పై ఛార్జర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారని ఆయన వివరించారు. |