ఐపీఎల్ రెండో సీజన్లో పరాజయాల పరంపరను కొనసాగిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఓటమిని చవిచూసింది. శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ కేకేఆర్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ బెర్త్‌కు చేరువైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డెక్కన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బ్రాడ్ హాడ్జ్ (41 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు) చేయగా, డేవిడ్ హస్సీ (43), గంగూలీ (33 పరుగులు), మెక్‌కల్లమ్ (20) పరుగులు సాధించాడు. కేకేఆర్ 19 ఓవర్లో 28 పరుగులు వచ్చాయి. ఐపీఎల్2లో ఒకే ఓవర్లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌శర్మ విరోచిత బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ చివరి బంతికి అద్భుత విజయాన్ని అందుకుంది.
రోహిత్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డెక్కన్‌కు ఐపీఎల్ 12 మ్యాచ్‌ల్లో ఇది ఏడో విజయం. ప్రస్తుతం ఐపీఎల్ పట్టికలో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న డెక్కన్ సెమీస్‌కు చేరువైంది. |