ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > ఛార్జర్స్‌పై ఒక పరుగు తేడాతో గెలిచిన పంజాబ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఛార్జర్స్‌పై ఒక పరుగు తేడాతో గెలిచిన పంజాబ్
FILE
ఆదివారం డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్‌ మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. కింగ్స్ లెవన్, ఛార్జర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు 134 పరుగులు సాధించింది.

సంగక్కర (43 బంతుల్లో 4 ఫోర్లతో 56 పరుగులు) అర్థసెంచరీ చేయగా, యువీ (20), పఠాన్ (17), మోతా (12), కాటిచ్ (11) పరుగులతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది.

పంజాబ్ జట్టు నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డెక్కన్ విఫలమైంది. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. డెక్కన్‌ చార్జర్స్‌ బౌలర్లను కట్టడి చేయడంలో పంజాబ్‌ బౌలర్లు ధీటుగా రాణించారు. జట్టు సారథి యువరాజ్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సృష్టించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్‌లో యువరాజ్‌ రెండో హ్యాట్రిక్‌‌ను నమోదు చేసుకున్నాడు.

ఛార్జర్స్ బ్యాట్స్‌మెన్లలో శర్మ (42), గిల్‌క్రిస్ట్ (23), గిబ్స్ (26), సైమండ్స్ (25), తేజా (10) పరుగులతో డెక్కన్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో పంజాబ్‌ను విజయం వరించింది.

ఇకపోతే.. డెక్కన్ బౌలర్లలో ఆర్పీసింగ్ 3 వికెట్లు పడగొట్టగా, సైమండ్స్, సుమన్, వేణుగోపాలరావులు ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు. అదేవిధంగా పంజాబ్ బౌలర్లలో యువరాజ్ సింగ్ 3 సాధించగా, పఠాన్, పొవార్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
రాజస్థాన్‌పై డేర్‌‌డెవిల్స్ విజయం
కేకేఆర్‌పై ఛార్జర్స్ సంచలన విజయం
కింగ్స్ విజయంతో ముంబై సెమీస్ ఆశలు గల్లంతు
ఛార్జర్స్ బౌలింగ్ కోచ్‌గా విక్టర్ బార్నెస్
ఇండియన్స్‌తో సూపర్ కింగ్స్ పోరు నేడే!
మా బ్యాటింగ్ బాగోలేదు: సెహ్వాగ్