ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > నైట్‌రైడర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నైట్‌రైడర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!
FILE
ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, కొల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే తప్పకుండా సెమీఫైనల్లోకి అడుగుపెట్టినట్లే. ఐపీఎల్ రెండో సీజన్లో వరుస పరాజయాలతో పరాభవానికి గురవుతున్న కొల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గడం పెద్ద సమస్య కాకపోవచ్చు.

ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఒకే ఒక్క విజయంతో కొనసాగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ కింగ్స్ కేకేఆర్‌పై గట్టిపోటీని ప్రదర్శించి తప్పకుండా విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మన్లు ఊపుమీదున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న హేడెన్, బాలాజీ, మురళీధరన్‌లు తమ బౌలింగ్, బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు నైట్ రైడర్స్ బౌలింగ్, బ్యాటింగ్ గురించి అంతగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకు కేకేఆర్‌తో మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో బరిలోకి దిగనున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌లోనూ విజయావకాశాలు తక్కువేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
ఛార్జర్స్‌పై ఒక పరుగు తేడాతో గెలిచిన పంజాబ్
రాజస్థాన్‌పై డేర్‌‌డెవిల్స్ విజయం
కేకేఆర్‌పై ఛార్జర్స్ సంచలన విజయం
కింగ్స్ విజయంతో ముంబై సెమీస్ ఆశలు గల్లంతు
ఛార్జర్స్ బౌలింగ్ కోచ్‌గా విక్టర్ బార్నెస్
ఇండియన్స్‌తో సూపర్ కింగ్స్ పోరు నేడే!