ఐపీఎల్ టోర్నీ రెండో సీజన్‌లో వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఎట్టకేలకు విజయం సాధించింది. సెమీఫైనల్‌కు చేరే జట్ల జాబితా నుంచి ఇప్పటికే అర్హత కోల్పోయిన నైట్‌రైడర్స్ జట్టు సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలచి, పరువు నిలుపుకుంది.
ఈ మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ విధించిన 189 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడం ద్వారా కోల్‌కతా చాలా రోజుల తర్వాత తన అభిమానులకు చక్కని ఆనందాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.
ఇందులో భాగంగా కోల్‌కతా బౌలర్లపై ప్రారంభం నుంచి విరుచుకుపడిన చెన్నై బ్యాట్స్‌మెన్ భారీస్కోరు దిశగా జట్టును నడిపించారు. ముఖ్యంగా రైనా (52), ధోనీ (40 నాటౌట్), బెయిలీ (30)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా సైతం ప్రారంభం నుంచి ధీటుగా ఆడింది. మెక్‌కలమ్ (81), హాడ్జ్ (71 నాటౌట్)లు రాణించడంతో కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించి, విజయకేతనం ఎగురవేసింది. |