కలిస్ (58 నాటౌట్), ద్రావిడ్ (38)లు రాణించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బలమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుపై బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. బెంగుళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన కలిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు విఫలమవడానికి తోడు మిగిలిన బ్యాట్స్‌మెన్ సైతం విఫలం కావడంతో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగలేకపోయింది. దినేశ్ కార్తీక్ (31) మాత్రమే ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగుళూరు జట్టు సైతం ప్రారంభంలో తడబడింది. అయితే రాస్ టేలర్ (25) వేగంగా పరుగులు సాధించడం, ద్రవిడ్, కలిస్‌లు రాణించడంతో బెంగుళూరు జట్టు 19 ఓవర్లలో 135 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా బెంగుళూరు జట్టు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. |