ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > పంజాబ్‌పై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పంజాబ్‌పై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
FILE
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెట్టింది. బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ సెమీస్ పోరులో, చెన్నై పంజాబ్ కింగ్స్‌ను 24 పరుగుల తేడాతో ఖంగుతింది.

చెన్నై నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. పోమర్స్‌బ్యాచ్ (26) తప్ప మిగిలిన పంజాబ్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేక పోయారు. దీంతో 117 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు అపసోపాలు పడ్డ పంజాబ్‌ 92/8కే కట్టడైంది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. బేలీ (15), పటేల్ (32), రైనా (20)ల బ్యాటింగ్‌‌తో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకుంది. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులను మాత్రమే చేయగలిగింది.

ఇక పంజాబ్ బౌలర్లలో.. పఠాన్, శ్రీశాంత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, చావ్లా, మోతా, పవార్‌లు ఒక్కో వికెట్ సాధించారు. అదేవిధంగా.. సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషారా, మురళీధరన్, రైనా, అశ్విన్‌లు రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

మరోవైపు.. చెన్నై చేతిలో పంజాబ్‌ కింగ్స్ ఓడిపోవడంతో బెంగళూరు, డెక్కన్‌‌లు ఊపిరిపీల్చుకున్నాయి. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌ ముంగిట నిలిచాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
ఐపీఎల్ సెమీస్ రేస్‌ నుంచి రాజస్థాన్ ఔట్
ఐపీఎల్2: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102
సూపర్ కింగ్స్‌తో పంజాబ్ సెమీస్ పోరు నేడే!
మెరిసిన కలిస్, ద్రవిడ్: బెంగుళూర్ గెలుపు
ఐపీఎల్: కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు
నైట్‌రైడర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!