ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ జట్టు సెమీస్ స్థానం ఖరారు కావడం, గెలిచినా ముంబై జట్టు సెమీస్ చేరే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది.
సెంచూరియన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డంగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. రహానే (56), సచిన్ (46)లు రాణించడంతో ముంబై జట్టు మంచి స్కోరు సాధించగలిగింది.
దీని తర్వాత 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు 17.3 ఓవర్లలోనే 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెహ్వాగ్ (50), గంభీర్ (47)లు రాణించడంతో ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. |