మనీష్ పాండే (114 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించడంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 12 పరుగుల తేడాతో డెక్కన్ ఛార్జర్స్ జట్టుపై విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 16 పాయింట్ల సాధించిన బెంగుళూరు మూడో స్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే బెంగుళూరు చేతిలో ఓటమి చెందినా మెరుగైన రన్‌రేట్ కారణంగా 14 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ సైతం సెమీస్‌లో చోటు దక్కించుకుంది.
సెంచూరియన్‌లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగుళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలోనే కలిస్ వికెట్‌ను కోల్పోయిన బెంగుళూరు జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే క్రీజులో ఉన్న మనీష్ పాండే ఇచ్చిన క్యాచ్‌ను ఆర్పీ సింగ్ వదిలేయడంతో బెంగుళూరు దశ తిరిగింది. ఆర్పీ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన పాండే ఆపై రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.
పాండే కారణంగానే నిర్ణీత 20 ఓవర్లలో బెంగుళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. దీని తర్వాత 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు గిబ్స్ (60) రాణించినా గిల్‌క్రిస్ట్ (15), సైమండ్స్ (18)లు పెద్దగా స్కోరు సాధించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. |