ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > మహామహులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పరుగుల యంత్రం 'లిటిల్ మాస్టర్'
FileFILE
ముంబైలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. వయస్సు... 16 ఏళ్లు. హేమాహెమీలు ఉన్న భారత క్రికెట్ జట్టులో కొత్త కుర్రాడు. నూనూగు మీసాల బుడతడు. ఈ బుడతడేనా... పాకిస్థాన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేది.... అని నోరెళ్ళబెట్టిన వారే అధికం. చివరకు ఆ బుడతడే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం వంటి ప్రపండ బౌలర్లను చీల్చి చెండాడే చిరుత అవుతాడని ఎవరూ ఊహించలేదు.

తొలి మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసినప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు చేసి, వారిపాలిట సింహస్వప్నంగా మారాడు. అతనే మన 'మాస్టర్ బ్లాస్టర్'. సచిన్‌ గురువారం (24వ తేది)తో 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35వ యేటలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో మన మేటి క్రికెటర్ గురించి తెలుసుకుందాం.

నన్ను తలపిస్తున్నాడు: బ్రాడ్‌మెన్
ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్ సర్ డోనాల్డ్ బ్రాడ్‌మెన్.. ఒకరోజు మాట్లాడుతూ 'సచిన్ నన్ను తలపిస్తున్నాడు' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు సచిన్ గురించి తెలుసుకునేందుకు. ఒక మహా క్రికెటర్ నుంచి ప్రశంసలు అందుకున్న సచిన్ భారత క్రికెట్‌‌కు వెన్నెముకగా నిలిచాడు. అభిమానులు మాత్రం ముద్దుగా 'లిటిల్ మాస్టర్' అని పిలుచుకుంటారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఉన్న మహామహుల కంటే సచిన్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాస్టర్ బ్లాస్టర్.. తన తెలివితేటలు, స్వశక్తి సామర్థ్యాలతో పైకొచ్చాడు. ముఖ్యంగా తనపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెపుతూ.. తన నైపుణ్యానికి మరింత పదునుపెడుతూ ఎదిగాడు. ఇదొక్కటే కాదు.. తనకు ధైర్య సాహసాలు మెండు అని సచిన్ తన 16వ ఏటనే నిరూపించాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌తో ఈ బుడతడు ప్రపంచ క్రికెట్ యవనికపై ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు.

కేవలం బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా మ్యాచ్‌లోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించే నేర్పు, ఓర్పు అతని సొంతం. అంతేకాకుండా ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల బౌలర్లను తన తెలివితేటలు, బ్యాటింగ్ అస్త్రాలతో సమర్థవంతంగా ఎదుర్కొనే తీరు అమోఘం. పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ మూడు దశాబ్దాలకుపైగా క్రీడాజీవితాన్ని కొనసాగిస్తున్న ఏకైక క్రికెటర్. కేవలం ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. అవసరమైనపుడు జట్టుకు పనికొచ్చే స్లో బౌలర్‌గా కూడా అమూల్యమైన సేవలు అదిస్తున్నాడు.
1 | 2  >>  
మరిన్ని
సెహ్వాగ్ వీర విహారం, భారీ స్కోరు దిశగా భారత్
తొలిటెస్టు: సెహ్వాగ్ సెంచరీ - రాణించిన జాఫర్
భారత జట్టుకు దొరికిన హైదరాబాద్ ఆణిముత్యం లక్ష్మణ్
భారత లెజెండ్ అనిల్ కుంబ్లే
ఈ వారం మహామహుడు.. దిలీప్ వెంగ్‌సర్కార్
ఈ వారం లెజెండ్: ముత్తయ్య మురళీధరన్