ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > మహామహులు > భారత జట్టు టెస్టు మ్యాచ్‌ల వీరుడు... లక్ష్మణ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత జట్టు టెస్టు మ్యాచ్‌ల వీరుడు... లక్ష్మణ్
క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌లకు ఓ విశిష్టమైన గుర్తింపు ఉంది. వన్డేల్లో చెప్పుకోదగ్గ గుర్తింపు సాధించిన ఆటగాళ్లు సైతం తమ కెరీర్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇందుకు కారణం లేక పోలేదు. వన్డేలు లాంటి నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లలో పరుగులు సాధించడానికి నైపుణ్యంతో పాటు కాస్త దూకుడు కూడా ఉండాలి.

అయితే టెస్ట్ మ్యాచ్‌లు అనేవి ఇందుకు పూర్తిగా విరుద్ధం. టెస్టు మ్యాచ్‌లు ఆడాలంటే నైపుణ్యంతో పాటు క్రీజులో ఎక్కువ సమయం గడిపే ఓపిక, అందుకు తగ్గ మానసిక సంసిద్ధత ముఖ్యం. అందుకే ఓ క్రికెటర్ టెస్ట్ మ్యాచ్‌లలో కూడా రాణిస్తేనే అతను పరిపూర్ణత సాధించినట్టుగా భావిస్తారు.

ఇంతటి విశిష్టత కల్గిన టెస్ట్ మ్యాచ్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న ఆటగాడిగా భారత్ తరపున వీవీఎస్ లక్ష్మణ్ పేరును మనం ప్రస్తావించవచ్చు. దాదాపు 12 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న లక్ష్మణ్ టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. టెస్టుల్లో చక్కగా రాణించే లక్ష్మణ్ అంటే ప్రపంచ ఛాంపియన్లు అయిన ఆస్ట్రేలియన్లకు సైతం ఓ కొరకరాని కొయ్యే.

భారత్ తరపున ఆస్ట్రేలియాపై చక్కని రికార్డు ఉన్న లక్ష్మణ్ ఆస్ట్రేలియా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు సదా సిద్ధంగా ఉంటాడు. అందుకేనేమో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరిగే ప్రతిసారీ లక్ష్మణ్‌ను ఔట్ చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు భావిస్తారంటే అతిశయోక్తి కాదు.

1 | 2  >>  
మరిన్ని
భారత క్రికెట్‌లో జార్ఖండ్ డైనమేట్... ధోనీ
'కంగారు'ల బ్యాటింగ్ బలం : ఆండ్రూ సైమండ్స్
పాక్ క్రికెట్ ఆణిముత్యం వసీం అక్రమ్
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీధరన్
భారత క్రికెట్‌లో హైదరాబాదీ ముత్యం : అజారుద్ధీన్
భారత క్రికెట్ జట్టు 'బెవాన్' యువరాజ్ సింగ్