ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
మాజీ స్పిన్నర్ మణీందర్‌కు బెయిల్
WD Employee
భారత మాజీ క్రికెటర్ మణీందర్ సింగ్‌కు బుధవారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కలిగి ఉన్న నేరంలో నార్కోటిక్స్ విభాగం అధికారులు మణీందర్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవంతో కోర్టు 50 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేసింది. అంతకుముందు మణీందర్ సింగ్ మాట్లాడుతూ కుటుంబ సమస్యల కారణంగానే మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్టు వెల్లడించాడు.

ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలోని తన ఇంట్లో ఓ నైజీరియా దేశస్థుని వద్ద నుంచి 1.5 గ్రాముల కొకైన్‌ను తీసుకుంటుండగా మణీందర్‌ సింగ్‌ అరెస్టయ్యాడు. మణీందర్‌తో పాటు అతని గృహానికి డ్రగ్స్ ఇచ్చేందుకు వచ్చిన నైజీరియన్‌ను కూడా అరెస్టు అయ్యాడు.
మరిన్ని
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మూడో వన్డే రద్దు
రెండో వన్డేలో 46 పరుగుల తేడాతో భారత్ గెలుపు