ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియాను ఈనెల 12వ తేదీన ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం వచ్చే గురువారం బిసిసిఐ జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశంకానుంది. ఇందులో ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేస్తామని బిసిసిఐ కార్యదర్శి నిరంజన్ షా శుక్రవారం వెల్లడించారు.
ఈ పర్యటనలకు ఎంపికయ్యే క్రికెటర్లు 13వ తేదీ మధ్యాహ్నానికి బెంగుళూరులో ఉండాలని, జూన్ 16వ తేదీ వరకు జరిగే క్రికెట్ శిబిరానికి తప్పకుండా హాజరుకావాలని ఆయన కోరారు. అయితే.. బ్యాట్స్‌మెన్స్‌కు ఫిట్‌నెస్ పరీక్షలను ఈనెల తొమ్మిది నుంచి 12వ తేదీ వరకు జాతీయ క్రికెట్ అకాడెమీలో నిర్వహిస్తామని నిరంజన్ షా వెల్లడించారు.
|