త్వరలో ఐర్లాండ్‌లో పర్యటించనున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సీనియర్ బ్యాట్స్‌మెన్ జాక్వెస్ కెల్లీస్‌ను తాత్కాలికంగా నియమించారు. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు ఐర్లాండ్, భారత్‌లతో వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
ఎడమకాలికి జరిగిన ఆపరేషన్ నుంచి కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఇంకా కోలుకోలేదని, అందువల్ల ఆయన స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా కెల్లీస్‌ను నియమించినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కన్వీనర్ హరూన్ లార్గెట్ వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ పర్యటనలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు చెప్పారు.
దక్షిణాఫ్రికా జట్టు వివరాలు.. కెల్లీస్ (కెప్టెన్), మార్క్ బౌచర్, డీ విల్లర్స్, డుమిని, గ్రిబ్స్, ఆండ్రూ హాల్, జస్టిన్ కెంప్, లాంగ్వెల్ట్, ఆండ్రూ నెల్, మఖయా ఎన్తిని, వర్నూన్ ఫిలాండర్, డలే స్టైన్, తండి హబలాబా, మోర్న్ వాన్.
|