ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
పాక్ క్రికెట్ వార్షిక బడ్జెట్ 39.6 మిలియన్ డాలర్లు
స్వదేశీ, అంతర్జాతీయ క్రికెట్‌ ప్రమాణాల పెంపుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వార్షిక బడ్జెట్‌ను 39.6 మిలియన్ డాలర్లుగా కేటాయించింది. అలాగే ఆటతీరు ఆధారంగా కొత్త కాంట్రాక్టు పద్దతిని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈవిషయమై పీసీబీ ఛైర్మన్ నసీమ్ అష్రాఫ్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న స్టేడియాల్లో కొత్త పిచ్‌ల రూపకల్పనకు 80 మిలియన్లను ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.

పాకిస్తాన్ జట్టు వచ్చే 2011 ప్రపంచ కప్‌లో 14 మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనుంది. టెస్టు వేదికల్లో ప్రమాణాల మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పీసీబీ కమ్యూనికేషన్ డైరక్టర్ ఎస్సాన్ మాలిక్ మాట్లాడుతూ.. కొత్త కోచ్‌ను నియమించేందుకు బోర్డు అధికారులు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రిచర్డ్ డాన్‌‌తో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అలాగే కోచ్ రేసులో డేవిడ్ వాట్‌మోర్, గోఫ్ లాసన్‌లు ఉన్నారని ఆయన వెల్లడించారు.
మరిన్ని
పాక్ వైస్ కెప్టెన్‌గా సల్మాన్ భట్
క్రికెటర్ల గ్రేడులు ప్రకటించిన బీసీసీఐ
బ్యాట్స్‌మెన్‌ రాణిస్తే విజయం మనదే: ది వాల్
బాధ్యతలు పెరిగాయి: ధోనీ
టెండూల్కర్ ఆరోగ్యం భేష్: ద్రావిడ్
విండీస్ కెప్టెన్‌గా క్రిస్ గేల్