ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
వచ్చే ప్రపంచ కప్‌కు ఉమ్మడి వీసాలు: శరద్ పవార్
ఆసియా ఉపఖండంలో నిర్వహించనున్న 2011 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి విసా సౌకర్యాన్ని కల్పించాలని ఆయా దేశాలను కోరనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించారు. ఈ ప్రపంచ కప్ పోటీలను భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డును నిర్వహించనున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో నాలుగు దేశాలకు చెందిన అధికారులు పాకిస్తాన్‌లో సోమవారం సమావేశమయ్యారు. క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించే ప్రేక్షకులు, అభిమానులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు వీలుగా ఉమ్మిడి వీసాలను ఇవ్వాలని కోరనున్నట్టు సమావేశానంతరం శరద్ పవార్ చెప్పారు.

ఇందుకోసం నాలుగు దేశాల ప్రభుత్వాల సహకారాన్ని కోరుతామన్నారు. అలాగే ఈ ప్రపంచ కప్‌ పోటీలను చరిత్రలో నిలిచి పోయే విధంగా నిర్వహిస్తామని పీసీబీ ఛైర్మన్ నసీమ్ అష్రాఫ్ వెల్లడించారు.
మరిన్ని
పాక్ క్రికెట్ వార్షిక బడ్జెట్ 39.6 మిలియన్ డాలర్లు
పాక్ వైస్ కెప్టెన్‌గా సల్మాన్ భట్
క్రికెటర్ల గ్రేడులు ప్రకటించిన బీసీసీఐ
బ్యాట్స్‌మెన్‌ రాణిస్తే విజయం మనదే: ది వాల్
బాధ్యతలు పెరిగాయి: ధోనీ
టెండూల్కర్ ఆరోగ్యం భేష్: ద్రావిడ్