ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
ఉప్పల్ స్టేడియానికి టెస్టు త్వరలో టెస్టు హోదా
అత్యాధునిక ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి త్వరలో టెస్టు హోదా లభించనుంది. ఈ స్టేడియానికి టెస్టు హోదా కల్పించాలని బీసీసీఐ తీర్మానించి, అంతర్జాతీయ క్రికెట్ మండలికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఐసీసీ అధికారులు త్వరలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తనిఖీ చేసి నివేదిక సమర్పిస్తారు.

అనంతరం ఈ స్టేడియానికి టెస్టు హోదా లభించవచ్చని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు శివలాల్ యాదవ్ తెలిపారు. ఇదిలావుండగా వచ్చే అక్టోబరు ఐదో తేదీన ఇదే స్టేడియంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది.
మరిన్ని
వచ్చే ప్రపంచ కప్‌కు ఉమ్మడి వీసాలు: శరద్ పవార్
పాక్ క్రికెట్ వార్షిక బడ్జెట్ 39.6 మిలియన్ డాలర్లు
పాక్ వైస్ కెప్టెన్‌గా సల్మాన్ భట్
క్రికెటర్ల గ్రేడులు ప్రకటించిన బీసీసీఐ
బ్యాట్స్‌మెన్‌ రాణిస్తే విజయం మనదే: ది వాల్
బాధ్యతలు పెరిగాయి: ధోనీ