ఐర్లాండ్ పర్యటన కోసం భారత జట్టు రేపు (బుధవారం) ఆ దేశానికి బయలుదేరి వెళ్లనుంది. ఈనెల 23వ తేదీన ఐర్లాండ్ జట్టుతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని 'టీమ్ ఇండియా' తలపడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జాతీయ సెలక్షన్ బోర్డు 15 మందితో కూడిన సభ్యులను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.
వీరికి బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో నాలుగు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడే భారత్.. ఐర్లాండ్‌తో ఓ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో మరో మూడు మ్యాచ్‌లు, పాకిస్తాన్ జట్టుతో మరో వన్డే మ్యాచ్ ఆడునుంది. ఈ సిరీస్‌కు మాజీ క్రికెట్ చందూబోర్డేను మేనేజర్‌గా నియమించిన విషయం తెల్సిందే.
|