ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
ఐర్లాండ్, స్కాట్లాండ్ సిరీస్‌ల అంపైర్ల ఎంపిక
ఐర్లాండ్, స్కాట్లాండ్ సిరీస్ కోసం అంపైర్లు, రెఫరీలను ఎన్నుకున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. మార్క్ బెన్సన్, బిల్లీ బౌడెన్, అలీమ్ దర్‌లు అంపైర్లుగా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా దేశాలు కూడా పాల్గొంటున్నాయి.

జూన్23 నుంచి జూలై1 వరకు జరిగే ఈ మ్యాచ్‌లకు అలన్ హర్స్ట్‌ను మ్యాచ్ రెఫరీగా నియమించగా, స్టోర్‌మాంట్‌లో ఐర్లాండ్‌తో జరిగే భారత్ మ్యాచ్‌కు మార్క్ బెన్సన్, బిల్లీ బౌడెన్‌లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగాను అలీందర్ మూడో అంపైర్‌గాను నియమించబడ్డారు.

అదేవిధంగా జూన్ 26 నుంచి జూలై 1 వరకు జరిగే భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు బెన్సన్, దర్‌లు అంపైర్లుగా వ్యవహరిస్తుండగా, జూన్ 28న దక్షిణాఫ్రికాతో భారత్ పోటీపడనున్న మ్యాచ్‌కు బౌడెన్, బెన్సన్‌లు అంపైర్లుగా నియమించబడ్డారు.

భారత్, పాక్‌ల మధ్య గ్లాస్గోలో జులై 3న జరిగే మరో మ్యాచ్‌లో బెన్సన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఇయాన్ గూడ్‌లు అంపైర్లుగాను, రోషన్ మహానామా రెఫరీగాను నియమించబడ్డారు.
మరిన్ని
రేపు ఐర్లాండ్‌కు భారత జట్టు పయనం
ఉప్పల్ స్టేడియానికి టెస్టు త్వరలో టెస్టు హోదా
వచ్చే ప్రపంచ కప్‌కు ఉమ్మడి వీసాలు: శరద్ పవార్
పాక్ క్రికెట్ వార్షిక బడ్జెట్ 39.6 మిలియన్ డాలర్లు
పాక్ వైస్ కెప్టెన్‌గా సల్మాన్ భట్
క్రికెటర్ల గ్రేడులు ప్రకటించిన బీసీసీఐ