స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి, నాలుగో టెస్టు మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌కు ఆఖరి రోజైన మంగళవారం ఇంగ్లాండ్ జట్టు 111 పరుగుల విజయలక్ష్యాన్ని మూడు వికె ట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది.
అంతకుముందు వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటై ఇంగ్లాండ్ ఎదుట 110 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే అప్ప టికి ఇంకా 50 ఓవర్లకు పైగా ఆట మిగిలివుండడంతో ఇంగ్లాండ్ అలవోకగా 21.4 ఓవర్లలోనే విజయం సాధించింది. పీటర్సన్ 28 పరుగులు చేయగా, వాన్ 48 పరుగులతో అజేయంగా మిగిలాడు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన చందర్‌పాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చక్కగా రాణించాడు. చందర్‌పాల్ 70, గేల్ 52, బ్రేవో 43 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ పనెసర్‌కు ఐదు వికెట్లు లభించాయి. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికైన చందర్‌పాల్, మాంటీ పనెసర్‌తో కలిసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా అందుకున్నాడు.
|