ప్రధాన పేజి   క్రీడలు  క్రికెట్  వార్తలు
 
ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు
ఐర్లాండ్ పర్యటన కోసం 'టీమ్ ఇండియా' బుధవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనకు ఎంపికైన జట్టు సభ్యులతో పాటు..బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్‌లు, కొత్త మేనేజర్ చందూ బోర్డే కూడా విమానం ఎక్కారు. కాగా ఐర్లాండ్ గడ్డపై దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్లతో నాలుగు వన్డే మ్యాచ్‌లు, పాకిస్తాన్‌తో మరో బెనిఫిట్ మ్యాచ్ ఆడుతుంది.

అనంతరం.. అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళతుంది. ఈ పర్యటన ద్రావిడ్ కెప్టెన్సీకి అసలుసిసలు పరీక్షకానుంది. రెగ్యులర్ కోచ్ లేకుండా భారత జట్టు జరుపుతున్న విదేశీ పర్యటన కావడం భారత జట్టుకు అత్యంత సవాల్‌తో కూడుకున్న పని.

ఇంగ్లాండ్ పర్యటన తాము రాణించేందుకు లభించిన మరో అవకాశమన్నారు. ముఖ్యంగా ప్రపంచ కప్ వైఫల్యం నుంచి తేరుకునేందుకు ఇదో సువర్ణావకాశమని ద్రావిడ్ అన్నాడు. అలాగే.. ఐర్లాండ్ పర్యటన కూడా ఓ చాలెంజ్‌తో కూడుకున్నదన్నాడు.
మరిన్ని
విండీస్ ఓటమి: టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ కైవసం
ఐర్లాండ్, స్కాట్లాండ్ సిరీస్‌ల అంపైర్ల ఎంపిక
రేపు ఐర్లాండ్‌కు భారత జట్టు పయనం
ఉప్పల్ స్టేడియానికి టెస్టు త్వరలో టెస్టు హోదా
వచ్చే ప్రపంచ కప్‌కు ఉమ్మడి వీసాలు: శరద్ పవార్
పాక్ క్రికెట్ వార్షిక బడ్జెట్ 39.6 మిలియన్ డాలర్లు