బెల్‌ఫాస్ట్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా అంపైర్లు ఈ మ్యాచ్‌ను 31వ ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా మీడియం పేసర్ వెర్నోన్ ఫిలాండర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ వికెట్ల పతానానికి కారకుడయ్యాడు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 30.5 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది.
ఐర్లాండ్ బ్యాట్స్‌మన్‌ల్లో కుసాక్ (36), కరోల్ (21) ఓ మేరకు రాణించారు. తొలుత టాస్ గెలిచి ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాంటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 31 వర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వాన్ విక్ (52), కలిస్ (47), డివిలియర్స్ (40) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో కుసాక్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
|