ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టును పరాజయాలు వీడటం లేదు. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయిన ఆ జట్టు.. ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో 225 పరుగులు చేసింది.
విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ (5/45) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 39.5 ఓవర్లలోనే 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 అధిక్యాన్ని సాధించింది. ఈ పర్యటనలో విండీస్ జట్టు ఇప్పటి వరకు కేవలం ఓ ట్వంటీ-20 మ్యాచ్‌లోనే విజయం సాధించింది.
|