ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభం
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఐర్లాండ్ పర్యటను పూర్తి చేసుకుని అటునుంచే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన 'టీమ్ ఇండియా'.. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు, ఏడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.

అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో భారత్ అటు బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో పూర్తిగా విఫలమైన విషయం తెల్సిందే. అయితే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ప్రాక్టీసు మ్యాచ్‌లో 171 పరుగులు చేసిన మంచి ఫామ్‌లో ఉన్నట్టు ఇంగ్లాండ్‌ బౌలర్లకు ముందస్త హెచ్చరికులు చేశారు. భారత టెస్టు క్రికెట్ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకావడం గమనార్హం.
మరిన్ని
యువ క్రికెటర్లు బాధ్యతతో ఆడాలి: కపిల్
లాంక్‌షైర్ జట్టుకు వీవీఎస్.లక్ష్మణ్ పేరు పరిశీలన
ఇంజీకి మొండిచెయ్యి చూపిన పీసీబి
తిరిగి ఫామ్‌లోకి వస్తా: హర్భజన్
రిటైర్మెంట్ గురించి ఆలోచించే సమయం కాదు: సచిన్
టెస్ట్ క్రికెట్ ఎన్నటికీ 'ఎవర్ గ్రీన్'‌: కపిల్