ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
ఇంగ్లాండ్ పర్యటన: నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు గురువారం నుంచి తొలి టెస్టు ఆడనుంది. 'క్రికెట్ మక్కా'గా ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగనుంది. అయితే.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుని మంచి జోరుమీద ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఢీకొననుంది.

ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీసు మ్యాచ్‌లో భారత అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం కాగా.. సచిన్ టెండూల్కర్ ఒక్కడే రాణించాడు. భారత టెస్టు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ అరుదైన తరుణంలో ఇంగ్లాండ్‌ గడ్డపై సిరీస్‌ను గెలుచుకోవాలని 'టీమ్ ఇండియా' కృతనిశ్చయంతో ఉంది.

గత 1986లో ఇంగ్లాండ్ నేలపై భారత జట్టు టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సిరీస్ అంతా బ్యాట్స్‌మెన్లపై ఆధారపడనుంది. భారత ఓపెనర్లతో పాటు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు రాణిస్తే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
మరిన్ని
రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభం
యువ క్రికెటర్లు బాధ్యతతో ఆడాలి: కపిల్
లాంక్‌షైర్ జట్టుకు వీవీఎస్.లక్ష్మణ్ పేరు పరిశీలన
ఇంజీకి మొండిచెయ్యి చూపిన పీసీబి
తిరిగి ఫామ్‌లోకి వస్తా: హర్భజన్
రిటైర్మెంట్ గురించి ఆలోచించే సమయం కాదు: సచిన్