హైదరాబాద్ క్రికట్ అసోసియేషన్‌కు చెందిన రంజీ క్రికెట్ ఆటగాళ్లు ఎస్సెల్ గ్రూపు తాజాగా ఆరంభించిన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు. హైదరాబాద్ ఆటగాళ్లు అంబటి రాయుడు, వినయ్ కుమార్, ఇబ్రహీం ఖలీల్, ఐఎస్ రెడ్డి, అనిరిధ్ సింగ్, కౌశిక్ రెడ్డి, శశాంక్ నాగ్‌లు ఐసిఎల్‌లో చేరనున్నట్టు తాజాగా ప్రకటించారు.
దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వినోద్ మాట్లాడుతూ ...ఏడుగురు ఆటగాళ్లు వెళ్లిపోవటం హైదరాబాద్ జట్టు కొంత బలహీనత పడుతుందన్నారు. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ఈనెల 21వ తేదీన జరిగే బీసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తామని ఆయన వివరించారు.
|