ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
భారత్‌పై ఇంగ్లాండ్ సంచలన విజయం
మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ముగిసిన నాలుగో వన్డేలో భారత్‌పై మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్ టెయిలెండర్లు బొపారా-బ్రాడ్‌లు ఎనిమిదో వికెట్ పడకుండా 99 పరుగులు సాధించి జట్టును విజయబాట నడిపించారు.

ఇంగ్లాండ్ ఒక దశలో 114 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి పరాజయం వైపు పయనించింది. ఈ తరుణంలో బొపారా (43 నాటౌట్), బ్రాడ్ (45 నాటౌట్) లు నిలిచి జట్టును ఆదుకున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కాలింగ్‌వుడ్ 47 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్ ఏడు వన్డేల సిరీస్‌లో 3-1 ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.

ఈ మ్యాచ్‌ పరాజయంతో భారత్ ఇక ముందు సిరీస్ విజయం కంటే కనీసం ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అంతకుముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, యువరాజ్ సింగ్ (71), సచిన్ (55) రాణింపుతో 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటయింది.
మరిన్ని
అక్టోబర్‌లో విచారణకు రానున్న వూమర్ కేసు
మ్యాచ్‌ను గెలిపించ గలిగే సత్తా వారికివుంది: మాలిక్
ట్వంటీ-20 నుంచి మురళీధరన్ దూరం
ఒలింపిక్స్‌‌లో క్రికెట్‌ని చేర్చెందుకు ఐసీసీ ఆరాటం
జట్టు ఫీల్డింగ్ మెరుగుపడాలి: ద్రావిడ్
మాజీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లెజండ్ మెక్లిన్ మృతి