ధక్షిణాఫ్రికా, డర్బన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ట్వంటీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 141 పరుగు చేసింది.
దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఓపెనర్లు గంభీర్ పరుగులు తీయకనే ఆసిఫ్ విసిరిన బంతిని అతనికే అప్పగించి వెనుతిరగగా, మరో ఓపెనర్ సెహ్వాగ్ సైతం ఐదు పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ చెపట్టిన ఊతప్ప కొంత నిలదొక్కుకుని జట్టుకు చేయూతమిచ్చి అర్థ శతం చేసి ఆటను సరిపెట్టుకోగా, అనంతరం బరిలోకి అడుగు పెట్టిన యువరాజ్ సింగ్ ఒక పరుగు తీసి చతికిలపడ్డాడు.
ఆ వెంట బ్యాట్‌ను అందుకున్న కార్తిక్ 11 పరుగులు చేసి ఆసిఫ్ చేతిలో ఖంగుతిన్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ధోని 33 పరుగులు చేసి అరాఫత్ విసిరిన బంతిని యునిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అటుతరువాత బ్యాటింగ్ చేపట్టిన పఠాన్ 20 పరుగులతో ఆటను సరిపెట్టుకోగా, హర్బజన్ సింగ్ ఒక పరుగు చేసి చతికిలపడ్డాడు.
ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్ బరిలో దిగిన అగార్కర్ 14 పరుగులు చేసి రనౌట్ కాగా, శ్రీశాంత్ ఒక పరుగు చేసి ఆటలో ఉన్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి పాక్ విజయలక్ష్యాన్ని నిర్ణయించింది.
|