ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
'బౌల్ అవుట్‌'తో భారత్ జయభేరి
ట్వంట్వీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ సూపర్ ఎయిట్ దశకు చేరుకుంది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ బౌల్ అవుట్ పద్దతిలో విజయాన్ని సాధించింది. పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో పాటుగా స్కాట్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో భారత్ జట్టు మూడు పాయింట్లను దక్కించుకుని గ్రూప్ డిలో అగ్రస్థానాన్ని పొందింది.

భారత్‌తో నువ్వానేనా అన్న రీతిలో పోరాడిన పాకిస్థాన్ రెండు పాయింట్లు దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 141 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్థాన్ కూడా అదే స్థాయిలో పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది . దీంతో బౌల్ అవుట్ విధానం ద్వారా భారత్‌ను విజేతగా ప్రకటించారు.
మరిన్ని
ట్వంటీ 20 టోర్నీ: పాక్ విజయలక్ష్యం 142
కెన్యాపై శ్రీలంక ఘనవిజయం
టెస్టులకు కెప్టెన్‌గా 'మాస్టర్ బ్లాస్టర్'...!
కెప్టెన్ పదవి నుంచి వైదొలగిన ద్రావిడ్
ట్వంటీ-20 ప్రపంచ కప్: జింబాబ్వేపై ఇంగ్లాండ్ విజయం
ట్విటీ-20 ప్రపంచ కప్: నేడు దాయాదుల పోరు