దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 తొలి ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 191 పరుగులుగా కివీస్ నిర్థేశించింది. జోహెన్స్ బర్గ్‌లోని వాండర్సన్ స్టేడియంలో న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరగులు చేసింది.
ఆ జట్టులోని ఓపెనర్ బిబి.మెక్‌మిలన్ 31 బంతుల్లో 45 పరుగులు, సిడి.మెక్‌మిలన్ 23 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోరుతో 44 పరుగులు, ఓరమ్ 15 బంతుల్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు స్కోరును అమిత వేగంగా పెంచారు. కివీస్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది సిక్సర్లు 17 ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లలో ఆర్పీ సింగ్ రెండు వికెట్లు, శ్రీశాంత ఒకటి, హర్భజన్ రెండు, యువరాజ్ సింగ్ ఒక వికెట్ చొప్పు తీయగా, నాలుగు రనౌట్‌లు చేశారు.
|