ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
ట్వంటీ-20 కప్: భారత్‌పై కివీస్ విజయం
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్థేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 17 బంతుల్లో (రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లు) 40 పరుగులు, గౌతం గంభీర్ 33 బంతుల్లో (రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు) 51 పరుగులు చేసి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలో 76 పరుగులు చేశారు.

అయితే.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు మిగిలిన పనిని పూర్తి చేయడంలో విఫలయమయ్యారు. దీంతో కివీస్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ బౌలర్లలో డేనియల్ వెట్టోరి నాలుగు వికెట్లు, బాండ్ ఒకటి, పటేల్‌ ఒకటి, ఓరమ్ ఒకటి చోప్పున వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. అంతకుముందు.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసిన విషయం తెల్సిందే.
మరిన్ని
భారత్ విజయ లక్ష్యం 191 పరుగులు
'బౌల్ అవుట్‌'తో భారత్ జయభేరి
ట్వంటీ 20 టోర్నీ: పాక్ విజయలక్ష్యం 142
కెన్యాపై శ్రీలంక ఘనవిజయం
టెస్టులకు కెప్టెన్‌గా 'మాస్టర్ బ్లాస్టర్'...!
కెప్టెన్ పదవి నుంచి వైదొలగిన ద్రావిడ్