ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
ట్వంటీ-20 కప్: ఆసీస్ అలవోక విజయం
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అలవోక విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్థేశించిన 124 పరుగులు విజయలక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటిగ్ బంగ్లాదేశ్‌ జట్టును బ్యాటింగ్‌కు దించాడు.

కంగారుల బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (32), ఆఫ్తాప్ అహ్మద్ (31)లు మాత్రమే రాణించడంతో ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ మూడు, బ్రాకన్ రెండు వికెట్లు తీయగా.. క్లార్క్, జాన్సన్, ఎంజే.క్లార్క్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం 124 పరుగులను చేధించేందుకు బరిలోకి దిగిన కంగారులు.. 11.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఓపెనర్లు గిల్ క్రిస్ట్ 28 బంతుల్లో 43, హెడెన్ 48 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశారు. గిల్ క్రిస్ట్ దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో ఒక్క వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం కెప్టెన్ రికీ పాంటింగ్ సాయంతో హెడెన్ జట్టుకు విజయాన్ని అందించాడు.
మరిన్ని
ట్వంటీ-20 కప్: భారత్‌పై కివీస్ విజయం
భారత్ విజయ లక్ష్యం 191 పరుగులు
'బౌల్ అవుట్‌'తో భారత్ జయభేరి
ట్వంటీ 20 టోర్నీ: పాక్ విజయలక్ష్యం 142
కెన్యాపై శ్రీలంక ఘనవిజయం
టెస్టులకు కెప్టెన్‌గా 'మాస్టర్ బ్లాస్టర్'...!