ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
వరల్డ్ కప్ ట్వంటీ-20: ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం
వరల్డ్ కప్ ట్వంటీ-20లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి కాలింగ్ వుడు ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిర్ణీత ఓవర్లలో దక్షణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 154 పరుగులను చేసింది. జట్టులో మోర్కెల్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ జట్టులో ఓఏ.షా అత్యధికంగా 36 పరుగులు చేశాడు. మోర్కల్ బౌలింగ్‌లోనూ రాణించి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు`ను బ్యాటింగ్‌లోను బౌలింగ్ రాణించిన దక్షిణాఫ్రికా ఆటగాడు మోర్కెల్ సొంతం చేసుకున్నాడు.
మరిన్ని
చివరి ఓవర్లే కారణం: ధోని
ట్వంటీ-20 కప్: ఆసీస్ అలవోక విజయం
ట్వంటీ-20 కప్: భారత్‌పై కివీస్ విజయం
భారత్ విజయ లక్ష్యం 191 పరుగులు
'బౌల్ అవుట్‌'తో భారత్ జయభేరి
ట్వంటీ 20 టోర్నీ: పాక్ విజయలక్ష్యం 142