ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
హైదరాబాద్‌కు చేరుకున్న ఆసీస్, భారత్ జట్లు
శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనున్న మూడవ అంతర్జాతీయ వన్డేలో పాలుపంచుకునే నిమిత్తం ఆస్ట్రేలియా మరియు భారత్ క్రికెట్ జట్లు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో క్రికెట్ క్రీఢాభిమానులు ఇరు పక్షాలకు ఘనస్వాగతం పలికారు.

ఇరు జట్ల ఆటగాళ్ళ రాకను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) విమానాశ్రయంలో భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌కు చేరుకున్న ఆటగాళ్ళలో కొందరు నెట్‌ప్రాక్టీస్ చేసేందుకు స్టేడియంకు వెళ్ళగా మరికొందరు ఆటగాళ్ళు హైదరాబాద్ 10కే రన్ - ఆఫ్ మారథాన్ 2007 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వెళ్ళారు.

ఇదిలా ఉండగా శుక్రవారం జరుగునున్న మూడో వన్డేకు వేదిక కానున్న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసారు.
మరిన్ని
హాట్ కేకుల్లా అమ్ముడు పోయిన ముడో వన్డే టిక్కెట్లు
రెండో వన్డే ఓటమికి పసలేని బౌలింగే కారణం: ధోనీ
తొలి టెస్టు: కష్టాల్లో పాకిస్తాన్
పగ్గాలు చేపట్టే సామర్థ్యం ధోనికుంది: ఛాపెల్
కోచి వన్డే: సౌరభ్ గంగూలీకి విశ్రాంతి
భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డే వర్షార్పణం