సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక జట్టు 65 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1 తేడాతో ఇంగ్లాండ్ సమం చేసింది. ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓఏ షా (82), కాలింగ్ వుడ్ )42), స్వాన్ (34) పరుగులతో రాణించారు.
అనంతరం 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 44.3 ఓవర్లలోనే 169 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేక పోయారు. లంక జట్టులో ముబారక్ చేసిన 44 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించి రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఓఏషా ఎంపికచేశారు.
|