ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి నన్డేలో పాకిస్దాన్‌పై దక్షిణాఫ్రికా 45 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఓపెనర్ గిబ్స్ (102), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (103) సెంచరీలు భారీ స్కోరుకు బాటలు వేశారు.

అనంతరం 295 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లు ముగియకముందే 249 పరుగులకుచేసి ఆలౌట్ అయింది. మహమ్మద్ యూసూఫ్ 53 పరుగులతో పాకిస్థాన్ జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఎన్తిని కీలకమైన నాలుగు వికేట్లు తీసి జట్టు విజయానికి బాటలు వేశాడు. డివిలియర్స్‌కు `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్` అవార్డు లభించింది.
మరిన్ని
తొలి వన్డే: పాక్ విజయ లక్ష్యం 295
తొలి వన్డే: దక్షిణాఫ్రికా బ్యాటింగ్
ఉత్కంఠభరిత పోరులో భారత్ గెలుపు
ఐపీఎల్‌కు మరికొందరు అంతర్జాతీయ క్రికెటర్లు
నేడు ఏడో వన్డే: పరువు కోసం టీమ్ ఇండియా ఆరాటం
ద్రావిడ్ తొలగింపు డిమాండ్ సహేతుకం: జడేజ