ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
కెప్టన్సీకి "నో" చెప్పిన సచిన్ టెండూల్కర్
"టీం ఇండియా" టెస్ట్ మ్యాచ్ పోటీలకు సారథ్యం వహించేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాకరించాడు. ఈ మేరకు ఓ లేఖను భారత క్రికెట్ నియంత్రణ సమాఖ్య (బీసీసీఐ) అధ్యక్షుడు శరత్ పవార్‌కు పంపించాడు. వ్యక్తిగత కారణాల వలన తాను టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీని చేపట్టలేకపోతున్నట్లు తన లేఖలో పేర్కొన్నాడు.

ఇదే విషయాన్ని సచిన్ సెలక్టర్లకు వ్యక్తిగతంగా తెలియజేశాడు. దీనితో టెస్ట్ కెప్టెన్సీని సచిన్‌కు అప్పగించాలన్న బీసీసీఐ నిర్ణయంపై నీరు జల్లినట్లైంది. అయితే ప్రస్తుతం సచిన్‌తో సహా కెప్టెన్సీ సారథ్యం వహించడానికి అర్హులైన వారు జట్టులో ఇద్దరే ఉన్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

సీనియర్ ఆటగాళ్ళకు జట్టులో సరియైన గౌరవం దక్కనుందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచిన్ వెల్లడించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ మినహా కెప్టెన్సీని చేపట్టగల సత్తా ఉన్న ఆటగాళ్ళు మరొకరు లేరని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
ఆసీస్ ఓటమిని ఎరిగిన జట్టే: క్లార్క్
జట్టులో ఉన్నంతకాలం రాణించాలి: ధోనీ
తేలికపాటి బ్యాట్‌ను ఉపయోగిస్తున్న సచిన్
దాయాదుల క్రికెట్: నేడే తొలి సమరం
గౌహతికి చేరుకున్న 'టీమ్ ఇండియా'
భారత పర్యటన యధాతథం:పీసీబీ