ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
భారీ ఆధిక్యంపై కన్నేసిన దక్షిణాఫ్రికా
జోహాన్స్‌బర్గ్ వాండర్స్ స్డేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజున దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఆమ్లా (76), కాలీస్ (85) ఉన్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు జాక్విస్ కలిస్ - ఆమ్లాలు రాణించటంతో దక్షిణాప్రికా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఇప్పటి వరకు 287 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. అంతకుముందు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో గిబ్స్ (63) సాయంతో 226 పరుగులకు ఆలౌటయింది. బాండ్ 4, మార్టిన్ 3, వెటోరీ 2 వికెట్లు పడగొట్టారు.

దక్షిణాప్రికా బౌలర్ స్టైన్ (5/34) ధాటికి 118 పరుగులకే ఆలౌటయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లెమింగ్ (40) మాత్రమే రాణించాడు.
మరిన్ని
మూడో వన్డేకు షారుఖ్‌ను ఆహ్వానించొద్దు: యూపీసీఏ
బ్యాటింగే మా బలం: ధోనీ
ఆ సెంచరీ బాబ్ వూమర్‌కు అంకితం: యూనస్ ఖాన్
భారత్-పాక్ జట్లుకు అపరాధం
టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే
రెండో వన్డే: యూనస్ సెంచరీ.. పాక్ విజయం