క్రికెట్ ఆటలోని ఎత్తులు పైఎత్తులు ఒక బౌలర్‌గా తనకు తెలుసునని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. శనివారం పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. టీమ్ ఇండియా యువరక్తంతో కూడుకునివుందని, యువక్రీడాకారులు మైదానంలో ఆక్రోషంగా నడుచుకోవడంలో తప్పులేదని 37 ఏళ్ళ లెగ్ మాత్రికుడు సమర్థించాడు. ముఖ్యంగా ఆటలో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఒక బౌలర్‌గా తెలుసునని, టెస్టు క్రికెట్‌లో భారత జట్టును రాణింపజేసేందుకు తన తెలివితేటలను ఉపయోగిస్తానని కుంబ్లే అన్నాడు.
భారత టెస్టు క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మూడో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కావడం గమనార్హం. గతంలో బిషన్ సింగ్ బేడీ, వెంకట్రాఘవన్‌లు భారత జట్టుకు నాయకత్వం వహించిన ఘనత సాధించారు. భారత కెప్టెన్‌గా నియమించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. పోటీదారుల్లో నా పేరు ఉన్నట్టు దేశ ప్రజల్లో చర్చ సాగింది. సచిన్ కెప్టెన్సీ కాదన్న తర్వాతే నా పేరు తెరపైకి వచ్చింది. అందువల్ల పెద్ద ఆశ్చర్యం లేదని భారత క్రికెట్ లెజండ్ అన్నాడు.
|