ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
మాలిక్ కెప్టెన్సీ పదవీకాలం పొడిగింపు: పీసీబీ
మొహలిలో జరిగిన ఇండో-పాక్ రెండో వన్డేలో సాధించిన విజయంతో పాక్ క్రికెట్ కెప్టెన్ షోయబ్ మాలిక్ పదవీ కాలాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మరో ఏడాది పొడిగించింది. మాలిక్ సారథ్యంలో రెండోవన్డేలో పాక్ గట్టి పోటీని ప్రదర్శించిందని పీసీబీ అభినందించింది.

వచ్చే ఏడాది 2008 డిసెంబర్ వరకు పాక్ క్రికెట్ టీంకు మాలిక్ సారథ్యం కొనసాగుతుందని పీసీబీ ఛైర్మన్ నాసిమ్ అష్రఫ్ పేర్కొన్నారు. పాక్ క్రికెటర్లను తమ సారథ్యంలో గట్టిపోటీని ప్రదర్శింప జేయడంతో పాటు రోజు రోజుకి తాను (మాలిక్) కూడా మ్యాచ్‌ల్లో తీవ్రంగా దృష్టి సారిస్తున్నాడని అష్రఫ్ విలేకరులతో చెప్పారు.

25 ఏళ్ళ మాలిక్ ఇప్పటికే 147 వన్డే మ్యాచ్‌ల్లోనూ, 20 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడాడని వెల్లడించారు. అంతేకాకుండా టీం వైస్-కెప్టెన్‌గా సీనియర్ బ్యాట్స్‌మెన్ యూనిస్‌ఖాన్‌ను పీసీబీ నియమించిందని అన్నారు.
మరిన్ని
ఓ బౌలర్‌గా ఆటలోని ఎత్తులు తెలుసు: కుంబ్లే
భారీ ఆధిక్యంపై కన్నేసిన దక్షిణాఫ్రికా
మూడో వన్డేకు షారుఖ్‌ను ఆహ్వానించొద్దు: యూపీసీఏ
బ్యాటింగే మా బలం: ధోనీ
ఆ సెంచరీ బాబ్ వూమర్‌కు అంకితం: యూనస్ ఖాన్
భారత్-పాక్ జట్లుకు అపరాధం