ఇండియన్ ఆయిల్ కప్ సిరీస్‌లోని మూడో వన్డే కోసం భారత్-పాకిస్తాన్ జట్టు కాన్పూరుకు చేరుకున్నాయి. ఇక్కడి గ్రీన్ పార్కు మైదానంలో ఆదివారం మూడో వన్డే జరుగనున్న విషయం తెల్సిందే. కాగా.. రెండేళ్ళ తర్వాత కాన్పూర్ మైదానం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రికెట్ మ్యాచ్‌కు యూపీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరై, మ్యాచ్ అనంతరం బహుమతులను అందజేయనున్నారు.
ఇదిలావుండగా.. ఈ మ్యాచ్‌కు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ హాజరుకానున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని మ్యాచ్ నిర్వాహాకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. షారూఖ్‌ను ఆహ్వానించవద్దని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకు విజ్ఞప్తి చేసిన విషయం తెల్సింది.
మ్యాచ్ అనంతరం ఇక్కడే ఉండే ఇరు జట్ల ఆటగాళ్ల కోసం.. 12వ తేదీన బాలీవుడ్ చిత్రం 'ఓం శాంతి ఓం' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రివ్యూ షోలో ఆ చిత్ర హీరో షారూఖ్ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు పాల్గొననున్నారు.
అదే రోజు రాత్రి గ్రాండ్ డిన్నర్‌ను కూడా ఇరుజట్ల ఆటగాళ్లు ఇవ్వనున్నారు. లక్నోలో ఆటగాళ్లు బస చేసే సహారా సహార్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీసు భద్రను కల్పించారు. 13వ తేదీన నాలుగో వన్డే జరిగే గ్వాలియర్‌కు ఇరు జట్ల ఆటగాళ్లు తరలి వెళుతారు.
|