భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కాన్పూర్‌లో ఆదివారం జరుగనున్న మూడో వన్డేలోను భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పిచ్ క్యూరేటర్ శివకుమార్ స్పష్టం చేస్తున్నాడు. పిచ్ ఎండిపోయి, పసుపువర్ణంలో ఉండటమే కాకుండా.. పిచ్‌పై అక్కడక్కడ గడ్డి ఉందన్నాడు. అందువల్ల మొదట బ్యాటింగ్‌కు దిగే జట్టు 300 పైచిలుకు పరుగులు చేయవచ్చన్నాడు.
అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కొద్దిగా బౌన్స్ అవుతుందన్నారు. పిచ్‌లో కొద్దిగా తేమ ఉంటుందని అందువల్ల తొలి ఐదు, ఆరు ఓవర్లు ఆచితూచి ఆడటం మంచిదన్నారు. సాధారణంగా గ్రీన్ పార్కు మైదానంలో బంతి తక్కువగా బౌన్స్ అవుతందని, అయితే ఈ దఫా మాత్రం బంతి బాగా బౌన్స్ అవుతూ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెప్పాడు.
రెండో సారి బ్యాటింగ్‌కు దిగే జట్టు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుందని కుమార్ అన్నాడు. గత 2005 ఏప్రిల్ నెలలో ఇరు జట్లు ఈ మైదానంలో తలపడగా.. పాక్ విజయం సాధించింది. పాక్ చిచ్చరపిడుగు షాహిద్ ఆఫ్రిది కేవలం 45 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు చేశాడు.
|