ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
సచిన్-గంగూలీ ఓపెనింగ్ జోడీ కొత్త రికార్డు
క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా పేరుగాంచిన సచిన్-గంగూలీ జంట ఆదివారం సరికొత్త మైలురాయిని చేరుకుంది. కాన్పూర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో ఈ జోడీ ఓపెనింగ్ వికెట్‌కు మరో మారు యాభై ప్లస్ పరుగులు జోడించి ఈ రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి వికెట్‌కు అత్యధిక అర్థ శతకాలు సాధించిన జోడీగా రికార్డుపుటలకెక్కింది.

ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్-ఆడమ్ గిల్ క్రిస్ట్‌ల పేరిట ఉంది. ఈ జోడీ 105 ఇన్నింగ్స్‌లలో 43 అర్థ సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, భారత జోడీ 135 ఇన్నింగ్స్‌లలో 44 సార్లు యాభై ప్లస్ పరుగులను చేశారు. అలాగే... ఓపెనింగ్ వికెట్‌కు అత్యధిక పరుగులు చేసిన జోడీగా పేరుపొందింది. 21 సెంచరీల భాగస్వామ్యంతో 6598 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జంట 5145 పరుగులు చేసింది.
మరిన్ని
నేడు మూడో వన్డే: భారత్‌పై ఒత్తిడి
కాన్పూర్ వన్డేలోనూ భారీ స్కోరు..!
కాన్పూర్‌కు చేరుకున్న భారత్-పాక్ జట్లు
మాలిక్ కెప్టెన్సీ పదవీకాలం పొడిగింపు: పీసీబీ
ఓ బౌలర్‌గా ఆటలోని ఎత్తులు తెలుసు: కుంబ్లే
భారీ ఆధిక్యంపై కన్నేసిన దక్షిణాఫ్రికా